నూతన ASPను సన్మానించిన ప్రముఖులు
NEWS Dec 31,2025 10:44 am
నిర్మల్ జిల్లా నూతన ఏఎస్‌పీ పత్తిపాక సాయికిరణ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణ ప్రముఖులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్ రెడ్డి, సారంగాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అబ్దుల్ హాది, వెంగ్వపేట మాజీ సర్పంచ్ రమేష్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఉమ్మడి జిల్లా చైర్మన్ కొట్టే శేఖర్ తదితరులు కలిసి సన్మానం చేశారు.