ముందస్తు మొక్కుల్లో మేడారం భక్తులు!
NEWS Dec 31,2025 11:06 am
మేడారం ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముందుగానే భక్తులు తరలివస్తున్నారు. రద్దీని ముందుగానే తప్పించుకునేందుకు చిన్న పిల్లలు, వృద్ధులు ఇప్పుడే దర్శనాలు చేస్తున్నారు. తమ బరువుకు సమానంగా బెల్లం తూచి సమర్పించడం, యాట మొక్కులు పెట్టుకుంటున్నారు. ఈసారి జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లను కేటాయించింది. గద్దెల ఆధునికీకరణ, రహదారి విస్తరణ, జంపన్న వాగు వద్ద ప్రత్యేక తలస్నాన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.