31రాత్రి మందుబాబులకు గుడ్‌న్యూస్!
NEWS Dec 31,2025 05:54 am
న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం మత్తులో స్వయంగా ఇంటికి వెళ్లలేని వారు తమకు కాల్ చేస్తే ఉచితంగా ఇంటికి చేరవేస్తామని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ వర్కర్స్ యూనియన్ (TGPWU) తెలిపింది. 8977009804 నంబర్‌కు కాల్ చేస్తే ఫ్రీ రైడ్ సౌకర్యాన్ని అందిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దంటూ, #HumAapkeSaathHai ప్రచారం కింద కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.