సర్పంచ్ చెట్ల తొలగింపు కార్యక్రమం
NEWS Dec 31,2025 12:00 pm
పెద్దపల్లి (మం) మూలసాల గ్రామంలో ప్రధాన రహదారి ఇరువైపులా పెరిగిన చెట్లు వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతున్నాయి అనే విషయాన్ని గ్రామస్తులు సర్పంచ్ జూపాక శ్వేత వెంకటేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సర్పంచ్, ప్రమాదాలు లేకుండా ఉండేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టించారు. గ్రామంలో వాహనాలు, ప్రజలు సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ చర్య తీసుకున్నామని సర్పంచ్ తెలిపారు. గ్రామస్తులు ఆమె స్పందనను, చర్యను అభినందించారు.