స్మార్ట్ వ్యవసాయం దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. రైతులు పొలంలోకి దిగకుండానే ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేయొచ్చు! ఈ దిశగా ప్రయోగాలు చేసేందుకు హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధమైంది. SBI ఆర్థిక సహకారంతో దేశంలో తొలిసారిగా అత్యాధునిక AI, రోబోటిక్స్, ఐవోటీ ఆధారిత ప్రయోగశాలను ఏర్పాటు చేసింది.