రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NEWS Dec 31,2025 10:59 am
మామడ మండలం కొరటికల్ గ్రామానికి చెందిన మేక రఘు(36) 2రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.. కాగా అత్యవసర చికిత్స కోసం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈరోజు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే రఘు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..