బడ్జెట్‌లో 75 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్
NEWS Jan 31,2026 10:55 pm
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతూ 75 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు పలకనున్నారు. ఇప్పటి వరకు పన్ను, విధాన ప్రకటనలకే పరిమితమైన పార్ట్ ‘బీ’ని ఈసారి భారత్ ఆర్థిక భవిష్యత్తుపై విస్తృత దృక్పథాన్ని వివరించేందుకు ఉపయోగించనున్నారు. స్వల్పకాలిక ప్రాధాన్యతలు, దీర్ఘకాలిక లక్ష్యాలు, దేశీయ బలాలు, ప్రపంచ ఆశయాలను పార్ట్ ‘బీ’లో ప్రస్తావించనున్నారు. 2019లో సంప్రదాయ బ్రీఫ్‌కేస్‌తో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా, నాలుగేళ్లుగా కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సాధారణంగా పార్ట్ ‘ఏ’లో వ్యయ ప్రణాళికలు, కేటాయింపులు, పార్ట్ ‘బీ’లో ఆదాయ మార్గాలు, పన్ను మార్పులు ఉంటాయి.