పేద గిరిజన విద్యార్థులకు అండగా ఉంటాం :ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్
NEWS Sep 07,2026 11:30 pm
ఏజెన్సీలోని పేద గిరిజన విద్యార్థులకు ఉద్యోగులుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. నక్క సంతోష్‌ను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సంతోష్ కుటుంబ సభ్యులు, గిరిజన ప్రతినిధులు సంతోష్ దొర, సుధావీరస్వామి మధుకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు ఆటంకం కాకుండా అవసరమైన సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.