కాళోజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడు
NEWS Sep 10,2026 12:25 am
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన సాహిత్య స్ఫూర్తి, రచనలు ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య కొనియాడారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఎంపీ కావ్య హనుమకొండలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఇబ్బందులను తన రచనల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళ్లి వారిలో చైతన్యం నింపిన కాళోజి నేటి తరానికి ఆదర్శ ప్రాయుడని పేర్కొన్నారు.