కాజీపేటలో బస్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
NEWS Sep 10,2026 11:50 pm
హనుమకొండ జిల్లా కాజీపేట ప్రాంతంలో బస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కాజీపేట శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. రైల్వే శాఖ ద్వారా ప్రతిపాదిత భూమిని సమకూర్చుకోవడం,రైల్వే శాఖతో భూమి మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడం పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.