కాంస్య పతకం సాధించిన జగిత్యాల జట్టు
NEWS Sep 13,2026 10:15 pm
బెల్లంపల్లి పట్టణంలో 3 రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2026-27 పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు ప్రతిభ కనబరిచింది. సెమీఫైనల్‌లో సిద్దిపేట జట్టుతో తలపడిన బెల్లంపల్లి జట్టు 3-0 తేడాతో విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ తక్కువ సమయంలోనే సాఫ్ట్‌బాల్ బాలబాలికల జట్లు పతకాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్ గౌతమ్, పీడీలు రాజేష్, ప్రశాంత్‌తో పాటు క్రీడాకారులను పలువురు అభినందించారు.