వినాయక చవితి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
NEWS Sep 15,2026 12:14 am
రామారెడ్డి మండల ప్రజలకు, మద్దికుంట గ్రామస్థులకు, కాంగ్రెస్ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్సాగౌడ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని నర్సాగౌడ్ సూచించారు. ప్రజలందరూ ఐకమత్యంతో పండుగ వేడుకలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.