వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై పల్లె బాల్ రాజు గౌడ్
NEWS Sep 15,2026 12:13 am
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండల ప్రజలకు దుబాయ్ కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్, అల్రిష గ్రూప్ ఆఫ్ చైర్మన్ పల్లె బాలరాజు గౌడ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని పల్లె బాలరాజు గౌడ్ సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలందరూ ఐకమత్యంతో, పరస్పర సహకారంతో వేడుకలను నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.