శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు
NEWS Sep 15,2026 10:35 pm
తిరుమల శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏపీ ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి ఆయన పట్టువస్త్రాలు అందజేశారు. ఆనంద నిలయంలో స్వామి వారిని కుటుంబ సమేతంగా చంద్రబాబు దర్శించుకున్నారు. వారి వెంట మంత్రి లోకేశ్, బ్రాహ్మణి ఉన్నారు. సీఎం హోదాలో 16వ సారి స్వామి వారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు.