నీటి సమస్య పరిష్కరించాలి: సీపీఎం
NEWS Sep 20,2026 01:47 pm
ఎమ్మిగనూరులో జి ప్లస్ త్రీ గృహాల కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలను సీపీఎం నాయకులు పరిశీలించారు. కాలనీలో తాగునీటి కోసం వారానికి రూ.300 వసూలు చేస్తున్నారని నివాసితులు ఆరోపించారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించి, వాటర్ సంపు వద్ద ముళ్లకంపలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.