BRS అభ్యర్థిగా తలసాని తనయుడు?
NEWS Sep 21,2026 07:28 am
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. BRSలో ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్న నేతలు.. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, సాయికిరణ్ యాదవ్‌ను బరిలోకి దింపాలనే ఆలోచనలో BRS అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.