వేలంలో ₹ 2.21 లక్షలకు మట్టి గణేషుడు!
NEWS Sep 21,2026 01:19 pm
గణేషుడి వద్ద ఉంచిన లడ్డూలకు వేలం పాట నిర్వహిస్తుంటారు. కాని తూ.గో జిల్లా ఉండ్రాజవరం చివటంలో ఏకంగా వినాయకుడి విగ్రహానికే వేలం పాట నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించి పూజలు చేసిన మట్టి వినాయకుడికి వేలం నిర్వహించగా, అదే గ్రామానికి చెందిన భక్తుడు ముత్తా నాగేశ్వరరావు రూ.2,21,500లకు దక్కించుకున్నారు. కమిటీ నిర్వాహకులు అతడికి ప్రతిమను అందజేశారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ ఇలా కొనసాగిస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.