గ్రానైట్ వ్యర్థాలు తొలగించాలని గిరిజన రైతుల ధర్నా
NEWS Sep 25,2026 06:50 pm
రావికమతం మండలం కొమెరి రెవెన్యూ పరిధిలోని జీడిమామిడి తోటల్లోకి భారీ వర్షాలకు గ్రానైట్ వ్యర్థాలు చేరి పంటలను కప్పేస్తున్నాయని గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించి వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు, గిరిజన సంఘం నాయకుడు సోలేము రాజబాబు పాల్గొన్నారు.