గోవాడ షుగర్స్‌ను గాడిలో పెట్టేదెప్పుడు?
NEWS Sep 25,2026 07:10 pm
చోడవరం గోవాడ సహకార చక్కెర కర్మాగార రైతుల పాత బకాయిల చెల్లింపుతో సమస్య పరిష్కారం కాదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు వెంకటరమణ అన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించాలని కోరారు. రైతులకు సకాలంలో చెల్లింపులు, కార్మికుల ఉపాధి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.