అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా ఉండటంతో, బాలుడి ప్రాణాల కోసం మేనమామ ఏమాత్రం వెనుకాడలేదు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాలుడిని ఎత్తుకుని నదిని దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ సాహసం ‘బాహుబలి’ని తలపిస్తోందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.