బస్ కాంప్లెక్స్ వద్ద 2 బస్సులు ఢీ
NEWS Sep 27,2026 10:40 pm
అనకాపల్లి బస్ కాంప్లెక్స్ నుంచి వాల్తేరు వెళ్తున్న బస్సు బయటకు వస్తుండగా, సింధియా వైపు నుంచి అనకాపల్లి వస్తున్న మరో బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంతో కొద్దిసేపు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సులకు స్వల్ప నష్టం జరిగినట్లు సమాచారం.