500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
NEWS Sep 27,2026 04:50 pm
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ ఫ్రిడ్జ్ వద్ద 500కు పైగా తైవాన్ జామ, నిమ్మ మొక్కలను ప్రజలకు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని నిర్వాహకులు తెలిపారు. మొక్కలు అందించిన అటవీ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.