కరెంట్ తీగలకు అల్లుకున్న పిచ్చి పొదలు
NEWS Sep 27,2026 10:42 pm
బుచ్చయ్యపేట మండలం మంగలాపురం పంచాయతీ పరిధిలోని కుముందాముపేట గ్రామంలో విద్యుత్ స్తంభానికి, తీగలకు పిచ్చి పొదలు అల్లుకున్నాయి. దీంతో విద్యుత్ తీగలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలులు, వర్షాల సమయంలో తీగలు తెగిపడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి పొదలను తొలగించి, విద్యుత్ లైన్లను పరిశీలించాలని కోరుతున్నారు.