కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
NEWS Sep 27,2026 10:44 pm
కథలాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ఆది శ్రీను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని, మహిళలకు ప్రత్యేక పాత్ర నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాయితి నాగరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెలిచాల సత్యనారాయణ, జవాజి రవి, శ్రీధర్, సర్పంచులు న్యావనంది శేఖర్, ముదం రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరి ప్రసాద్, తీపి రెడ్డి అనంతరెడ్డి, మధు రెడ్డి, పంబాల శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.