కొత్త చరిత్ర సృష్టించిన కోహ్లీ
NEWS Sep 27,2026 10:40 pm
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 15 వేల పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 303 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, సచిన్ 377 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీ ఖాతాలో 54 సెంచరీలు ఉన్నాయి. 8 వేల నుంచి 14 వేల పరుగుల వరకు అత్యంత వేగంగా చేరిన రికార్డులు కూడా కోహ్లీ పేరిటే ఉన్నాయి.