కాకినాడలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య
NEWS Aug 28,2024 01:38 pm
కాకినాడకు చెందిన వెంకటేష్ వ్యక్తిగత కారణాలతో చీమల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంగళవారం జీహెచ్‌లో చేర్పించారు. పట్టణంలోని రేచర్ల పేటకు చెందిన రాజు వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన అతణ్ని చికిత్స కోసం మంగళవారం కుటుంబ సభ్యులు జీజీహెచ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇరువురు మరణించడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.