YCPలోనే ఉంటా: విజయసాయిరెడ్డి
NEWS Aug 28,2024 04:12 pm
వైఎస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన విజయసాయిరెడ్డి.. వైసీపీని వీడటంలేదని, తాను YCPలోనే కొనసాగుతానన్నారు. వైసీపీకి తాను విధేయత, నిబద్ధత కలిసిన కార్యకర్తనని చెప్పారు. కాగా విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.