వైసీపీకి షాక్ - ఎమ్మెల్సీ రాజీనామా
NEWS Aug 28,2024 05:53 pm
వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. నిన్న ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు రాజీనామా చేయగా.. నేడు ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీని వీడారు. వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.