జియో యూజర్లకు గుడ్ న్యూస్
NEWS Aug 29,2024 10:43 am
ఈ దీపావళీ నుంచి జియో యూజర్లకు 100GB వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తున్నట్టు ముకేష్ అంబానీ 47వ Relaince AGMలో ప్రకటించారు. తమ కస్టమర్ల కోసం AI ప్లాట్ ఫామ్ Jio Brain తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ముకేశ్. తక్కువ ధరకే AI మోడల్ సేవలను అందిస్తామని తెలిపారు. అలాగే AI క్లౌడ్ స్టోరేజీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లకు సైతం అదిరే శుభవార్త అందించారు. బోనస్ షేర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంటే 10 షేర్లు ఉన్న వారికి మరో 10 షేర్లు ఉచితంగా అందిస్తారు.